విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషరతుగా విరమించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ రమణమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద చేస్తున్న రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించి పదివేల కోట్లు నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.