విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగపు సహాయ ఆచార్యులు వూసల, క్రిస్టోఫర్ రచన చేసిన కాంప్రహెన్సివ్ అప్రోచ్ తో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే పుస్తకాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. శశి భూషణరావు తన కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య జి. శశి భూషణరావు మాట్లాడుతూ.. విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకునేందుకు ఉపయుక్తంగా ఈ పుస్తకం నిలుస్తుందన్నారు.