విద్యార్థులు చెడుసావాసాలకు దూరంగా ఉండాలని కోటవురట్ల ఎస్సై రమేష్ సూచించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూల్ విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడకూడదని అన్నారు. విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలన్నారు. అనవసరమైన విషయాల జోలికి పోకూడదన్నారు. ఈ సమావేశంలో హెచ్ఎం లక్ష్మి పాల్గొన్నారు.