వరి పంటపై ఆశించిన తెగుళ్లను సకాలంలో గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోటవురట్ల మండల వ్యవసాయ అధికారిని బి. సరోజిని సూచించారు. బుధవారం లింగాపురంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్య క్రమంలో ఆమె పాల్గొన్నారు. వరి పంటను పరిశీలించి మానిపండు తెగులు ఆశించినట్లు గుర్తించారు. దీని నివారణకు ప్రోఫికొనజాల్ మందును పిచికారి చేయాలన్నారు. రైతులందరూ ఈకేవైసి చేయించుకోవాలన్నారు.