పాలకొల్లుకు చెందిన పలివెల జయమ్మ అనే మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని మహిళ ద్వారకానగర్ రోడ్డుపై తిరుగుతుంది. ఈమెను గమనించిన ద్వారక పోలీసులు ఏయూటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి టీఎస్ఆర్ మహిళా షెల్టర్‌కు తీసుకెళ్లి ఆమె వద్ద ఉన్న కుమారుడి నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఆదివారం కుమారుడు శ్రీనుకు జయమ్మను అప్పగించారు.