రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ప్రశ్నించారు. విశాఖ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేస్తామని ప్రకటన చేశారని గుర్తు చేశారు. కానీ మూడు నెలలు కావస్తున్నా ఉచిత బస్సు ఇంకా రాలేదని మండి పడ్డారు. సూపర్ సిక్స్ పథకాలలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదన్నారు.