పరవాడ: బాధిత కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలి
పరవాడ ఫార్మసిటీ ఠాగూర్ లాబరేటరీ లో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి యాజమాన్యం రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి లోకనాథం, సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ బుధవారం డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలన్నారు.