అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
యలమంచిలిలో అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ అన్న క్యాంటీన్ తెరిపిస్తామని చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పేదవాళ్ల కడుపు నింపడం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి పాల్గొన్నారు.