పరవాడ ఫార్మాసిటీలో గల ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీకైన ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచింది. బుధవారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె. లోకనాథం, సీఐటీయూ ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.