అనకాపల్లి: రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణలను రద్దు చేయాలి
రెసిడెన్షియల్ విధానంలో ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు వేరే జిల్లాలో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను రద్దు చేయాలని కోరుతూ గురువారం సాయంత్రం అనకాపల్లి విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి ఆధ్వర్యం లోనిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెసిడెన్షియల్ పద్ధతిలో సంవత్సరం పొడవునా శిక్షణలు ఇవ్వడం సరైన పద్ధతి కాదని సూచించారు.