అనకాపల్లి జిల్లా పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో బుధవారం విషవాయువు లీక్ అయిన ఘటనపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చినా కంపెనీల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.