అనకాపల్లి: అభిజిత్ కంపెనీని తక్షణమే తెరవాలి
అభిజిత్ ఫెర్రో కంపెనీని వెంటనే తెరవాలని సీఐటీయూ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఆర్. శంకరరావు డిమాండ్ చేశారు. గురువారం అచ్యుతాపురం ఎస్ఈ జెడ్‌లో గల ఫెర్రో అల్లాయిస్ కార్మికులతో సమావేశమై మాట్లాడారు. యాజమాన్యం అక్రమంగా లే ఆఫ్ ప్రకటించిందనన్నారు. లే ఆఫ్ ప్రకటించే ముందు చట్టపరంగా తీసుకోవాల్సిన అనుమతులు కూడా తీసుకోలేదని చెప్పారు. తక్షణమే కంపెనీని తెరవాలన్నారు.