ప్రత్యేక శిక్షణ పొందిన స్వాట్ టీం అనకాపల్లి జిల్లాలో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. మంగళవారం శిక్షణ పూర్తి చేసుకున్న ఆ స్వాట్ టీంతో ఎస్పీ సమావేశమయ్యారు. 30 మంది మహిళలతో కూడిన సభ్యులతో ఈ స్వాట్ టీంను అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర ప్రదేశాలలో అత్యవసర పరిస్థితులలో ఈ టీం పని చేస్తుందన్నారు.