జాతీయ నులి పురుగుల నివారణ దిన్నోతవం పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం, చినగుమ్ములురులో ఉన్న కొల్లేరు ఐటిఐ కాలేజ్ విద్యార్థులకు ఏఎన్ఎం రత్నం డీవార్మింగ్ మెడిసిన్ (కడుపులో నులి పురుగుల కొరకు మందులు) అందించారు. వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... నులి పురుగుల నిర్మూలన చేసినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్ర వేసినట్లు అయితే నులిపురుగులను సులభంగా నిర్మూలించవచ్చునన్నారు. రక్త హీనత ఉండదని తెలిపారు.