అల్లూరి: కొడుకును హత్య చేసి పూడ్చి పెట్టిన తండ్రి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం ఏనుగుబయలులో మద్యానికి బానిసైన కొర్రా సన్యాసి(30) గురువారం రాత్రి తండ్రి చిత్రోతో గొడవ పెట్టుకున్నాడు. అడ్డుకున్న వారిని తీవ్రంగా కొట్టాడు. కుమారుడి నుంచి తప్పించుకునేందుకు తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని అడవిలోకి పారిపోయాడు. ఆయనను వెంబడిస్తూ కుమారుడు కూడా అడవిలోకి వెళ్లాడు. ఎక్కడ తనను చంపుతాడోనన్న భయంతో తండ్రి గొడ్డలితో కుమారుడిని నరికి చంపేసి.. గొయ్యి తీసి పాతిపెట్టాడు.