పెళ్లికూతురును తీసుకెళ్లేందుకు ఏకంగా హెలికాప్టర్ తెచ్చాడు (వీడియో)

81பார்த்தது
యూపీలోని రుస్తాంపూర్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుక వైరల్‌గా మారింది. రుస్తాంపూర్‌కు చెందిన అంజలి రాజ్‌పుత్‌ను మహమద్పూర్ గ్రామానికి చెందిన అమన్ గురువారం పెళ్లి చేసుకున్నాడు. అయితే శుక్రవారం తన భార్యను అత్తవారింటికి తీసుకెళ్లడానికి రూ.8 లక్షలు ఖర్చు పెట్టి ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. వధువు తల్లి ఇంటి నుంచి తన ఇంటికి దూరం కేవలం 14 కిలోమీటర్లు ఉండడం విశేషం. గ్రామంలోకి హెలికాప్టర్ రావడంతో ప్రజలందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

தொடர்புடைய செய்தி