ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు అల్లూరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన గురువారం చేపట్టారు. పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. నేతలు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ముఖ హాజరుకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోజుకు మూడుసార్లు ముఖ హాజరుకు సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.