AP: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గార్లదిన్నె మండలం కలగాసుపల్లె వద్ద ఆర్టీసీ బస్సు 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.