అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి గ్రామంలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు పూర్తిగా దగ్ధమై బాధితులు కట్టుబట్టలతో మిగలగా సుమారు 3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. చింతలపూడి గ్రామానికి చెందిన పుట్టా సత్యనారాయణ తాటాకిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దగ్ధమైంది. సత్యనారాయణ కుటుంబీకులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.