పాయకరావుపేట: వైసీపీ నేతలపై హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
వైసీపీ నేతలపై హోం మంత్రి అనిత బుధవారం విమర్శలు గుప్పించారు. అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదయ్యాయని అన్నారు. 'వైసీపీ నేతలు ఈ కేసులపై గగ్గోలు పెడుతున్నారు. ఎలాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్లకు తెలుసా? వాళ్ల పార్టీలోనే ఎంపీగా ఉన్న రఘురామపై అప్పట్లో పెట్టింది అక్రమ కేసు కాదా? అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం.. మీలా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడం లేదు' అని అనిత అన్నారు.