కోటవురట్ల: 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత తిరిగి అదే స్కూల్లో ఆదివారం కలుసుకున్నారు. 1974-75లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గుర్తుపట్టలేని విధంగా ముఖకవళికలు మారిపోయాయని పూర్వ విద్యార్థి పరశురామయ్య తెలిపారు. బాల్యంలో విడిపోయి వృద్ధాప్యంలో కలుసుకున్నట్లు పలువురు తెలిపారు.