ఉక్కు ఉద్యోగులకు షాక్
విజయదశమి అనేది చాలా పెద్ద పండుగ. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి ఉత్పత్తిని బట్టి బోనస్‌లు ఇవ్వడం రివాజు. విశాఖ ఉక్కు కర్మాగారంలో కూడా ఏటా నాన్ ఎగ్జిక్యూటివ్‌లకు అత్యధికంగా రూ. 36 వేలు, అత్యల్పంగా రూ. 17 వేలు బోనస్‌గా ఇచ్చేవారు. ఈ ఏడాది బోనస్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. ఇదిలావుంటే అక్టోబరు 10వ తేదీ వచ్చినా ఉక్కు ఉద్యోగులకు గత నెలకు సంబంధించిన జీతాలు ఇంతవరకూ ఇవ్వలేదు.