విశాఖలోని ఏయూలో కేంద్రం సహకారంతో ఎంఎస్ఎంఈ స్టార్టప్ హబ్ ఏర్పాటు కానుంది. దీని కోసం పరిశ్రమల శాఖ మంత్రి కే శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీని ఏర్పాటుకు రూ. 30 కోట్లు ఖర్చు అవుతుంది. నగరంలోని శివాజీ పాలెంలో మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో భవనాన్ని నిర్మిస్తారు. ఇది ఏర్పాటు అయితే ప్రత్యక్షంగా 500 మంది వరకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ విషయాన్ని సోమవారం ఏయూ అధికారులు వెల్లడించారు.