కొమరాడ మండలంలోని రాయగడ వెళ్లే అంతర రాష్ట్ర రహదారిపై 15 గంటల పాటు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం అర్థరాత్రి కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లుపై వర్షపు నీరు చేరింది. సోమవారం 11గంటల సమయంలో కొమరాడ సమీపాన గోతులో లారీ దిగబడి పోయింది. దీంతో అంతర్రాష్ట్ర రహదారిపై గల గోతులో లారీ దిగిపోవడంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.