మెంటాడ మండలం ఆండ్ర గ్రామంలో శనివారం భవానీలు మాతృభూమి సేవా సంఘం సమక్షంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిధిగా ఆండ్ర సబ్ ఇన్ స్పెక్టర్ సీతారాములు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం చాలా శుభపరిణామమని, యువత సేవా మార్గంలో పయనించాలన్నారు. వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు.