తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ విజయనగరం వారి ఆధ్వర్యంలో కార్తీక ద్వాదశి సందర్భంగా కోమటి పల్లి గ్రామంలో మంగళ కైశిక ద్వాదశీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి బోధనపల్లి గౌరి నృసింహ ప్రసాద్ శర్మ, సతీమణి సునీత మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాముడువలసలో మాట్లాడుతూ బుధవారం వేకువ జామున గ్రామంలో హరి నామ స్మరణ చేస్తూ నగర సంకీర్తనం చేయాలని కోరారు.