బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు సుజయ్ కృష్ణ రంగారావుకు కీలక పదవి వరించింది. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో ఆయనకు సముచిత స్థానం కల్పించింది. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రంగారావును నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.