బొబ్బిలి పట్టణంలోని మేదరబంద జంక్షన్లో ఏర్పాటు చేసిన వైన్ షాపును వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మద్యం షాపు వద్ద, ఆ షాపును అద్దెకు ఇచ్చిన యజమాని ఇంటి వద్ద ఐద్వా, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వెంటనే షాపును అక్కడి నుంచి తరలించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు కె. పుణ్యవతి, సిపిఎం బొబ్బిలి, రామభద్రపురం మండల కన్వీనర్లు, మహిళలు హెచ్చరించారు.