ఉండి: అమిత్ షా తో ఎమ్మెల్యే రఘురామ భేటీ
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని ఢిల్లీ పార్లమెంటు వారి కార్యాలయంలో మంగళవారం ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి తరఫున తనను ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఇరువురు కాసేపు చర్చించారు.