భోగాపురం: ఆలయ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేసిన కర్రోతు
భోగాపురం మండలం లింగాలవలస గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు శనివారం తనవంతు గా రూ. 3 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు కోరారు. ఈ మేరకు గ్రామస్తులు తమ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బుగత రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.