అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యాన్ని డెంకాడ పోలీసులు శనివారం పట్టుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ సమాచారం మేరకు మండలంలోని గుణుపూరు గ్రామ సమీపంలో ఓ వ్యక్తి కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న నేపథ్యంలో ఎస్ ఐ ఏ. సన్యాసినాయుడు శనివారం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన వ్యక్తి నుండి 192 మధ్యం సీసాలను, ఓ కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.