సూళ్లూరుపేట: నేలపట్టులో విదేశీ పక్షుల సందడి
తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలంలో ఉన్న నేలపట్టు దశాబ్దాల కాలంగా పక్షులకు విడిది కేంద్రంగా ఉంటోంది. పక్షులకు ఆహారమైన చేపలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. అందుకే విదేశీ పక్షుల ఏటా అక్టోబర్ నుంచి నేలపట్టుకు రావడం ప్రారంభిస్తాయి. అప్పటి నుంచి ఆరు నెలల పాటు వెదురుపట్టు, బోడిలింగలపాడు, అటకానితిప్ప తదితర ప్రాంతాల్లో చెట్లపై గూళ్లు కట్టుకుని విడిది ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తి అనంతరం తిరిగి వెళ్లిపోతాయి.