తిరుపతి జిల్లా నాయుడుపేట పరిధిలోని బీరదవాడ బస్టాండ్ వద్ద కోట్లు విలువచేసే స్థలం ఓ ప్రైవేటు వ్యక్తి తనదంటూ, తనకు పట్టా ఉందంటూ చదును చేసేందుకు సోమవారం యత్నించాడు. గమనించిన గ్రామస్థులు ఎన్నో సంవత్సరాలుగా ఈ స్థలం తమ పంచాయతీ పరిధిలో ఉందని ఉన్నపలంగా మీకు ఎలా పట్టా అయిందో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గ్రామస్థులను చెదరగొట్టారు.