తడ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని బుధవారం ఎంపీడీవో విజయ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. ఈ ఆధార్ అప్డేట్ కేంద్రంలో పేర్లు మార్పు, కొత్త ఆధార్ కార్డు నమోదు, ఫోటో, చిరునామా వంటి నమోదు పక్రియ జరుగుతోందని అన్నారు. పంచాయతీ కార్యాలయంలో మంగళ, బుధవారాల్లో తడ సచివాలయంలో 105 మంది సద్వినియోగం చేసుకున్నట్లు తడ పంచాయితీ కార్యదర్శి మస్తానయ్య తెలిపారు.