ఎక్సైజ్ సీఐగా శ్రీనివాసులు
పెదకూరపాడు ఎక్సైజ్ సీఐగా వి. శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో బాపట్ల ఎస్సైగా పనిచేశారు. ప్రమోషన్ తో కూడిన బదిలీపై పెదకూరపాడు ఎక్సైజ్ సీఐగా నియమించబడ్డారు. ఆయన మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకంగా మద్యం అమ్మే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా అమ్మేవారు గ్రామాల్లో ఉంటే పోలీస్ స్టేషన్ కు తెలియచేయాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సిఐ తెలిపారు.