నగరి మున్సిపల్ పరిధి బాలాజీ హైవే గార్డన్లో ప్రధాన వీధిలోని విద్యుత్ పోల్ శిధిలావస్థకు లోనైంది. పోల్ పైభాగంలో ప్రధాన తీగలు తగిలించి ఉన్న ఇనుప కమ్మీలు ఉన్న ప్రాంతంలో చిద్రమైంది. ఆ భారానికి పోల్ ఎప్పుడు విరిగి తీగలు కిందపడి ప్రమాదం జరుగుతుందేమో అన్న ఆందోళనను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగక మునుపే అధికారులు స్పందించి పోల్ మార్చాలని కోరుతున్నారు.