కుప్పం మున్సిపల్ ప్లోర్ లీడర్ జిమ్ దాము ఆధ్వర్యంలో మంగళవారం 19వ వార్డులో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యత్వం పొందారు. కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, సభ్యులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా, విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం, ఉపాధి, నైపుణ్య శిక్షణ తదితర సౌకర్యాలు అందిస్తామని జిమ్ దాము తెలిపారు.