తిరుపతి జిల్లా నూతన పంచాయతీ అధికారిగా డి. సుశీల దేవి ఆదివారం తిరుపతి కలెక్టరేట్ లోని పంచాయతీ ఆఫీసు బ్లాకులో బాధ్యతలు స్వీకరించారు. గతంలో తిరుపతి డివిజన్ పంచాయతీ అధికారిగా మరియు జిల్లా ఇన్ చార్జ్ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించారు. సాధారణ బదిలీల్లో ఆమెను జిల్లా నూతన పంచాయతీ అధికారిగా నియమించారు. ఈ సందర్భంగా ఆఫీసు కార్యాలయ సిబ్బంది ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.