తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా గల తోళ్ళప్ప గార్డెన్ లో శనివారం పంచాయతీ శాఖ టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు టిటిడి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు తగు సూచనలు చేశారు.