తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో భారీ చోరీ జరిగింది. సోమవారం వేకువజామున తాళాలు పగులగొట్టి టీచర్స్ ఇంట్లోకి దొంగలు చొరబడి రూ. 13లక్షలు విలువైన బంగారం, రూ. 50 వేల నగదు, 200 గ్రాముల వెండి, పట్టుచీరలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇంటి తాళాలు వేసి వెంకటరమణ, ప్రసన్నలక్ష్మి దంపతులు ఒరిస్సాలోని బంధువులకు ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.