యర్రావారిపాళెం మండలం యలమందలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందన ఆరోపణలపై ఎస్పీ సుబ్బారాయుడు సమగ్ర విచారణ జరిపారు. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ. 10వతరగతి చదువుతున్న బాలిక, బాలుడు సాయంత్రం వరకు మాట్లాడుకోవడంతో స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేసరికి చీకటి పడింది. తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక ఎవరో మత్తుమందు ఇచ్చి పొలాల్లోకి లాక్కెళ్లినట్లు కట్టుకథ అల్లినట్లు బాలిక వాగ్మూలంలో తెలిపినట్లు ఎస్పీ చెప్పారు.