సిబ్బంది నిర్దయ.. 3 కి.మీ. నడిచిన బాలింత

79பார்த்தது
సిబ్బంది నిర్దయ.. 3 కి.మీ. నడిచిన బాలింత
AP: ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సిబ్బంది నిర్దయగా వ్యవహరించారు. బాలింతను మార్గమధ్యలోనే వదిలిపెట్టడంతో 3 కి.మీ. నడిచి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన అల్లూరి జిల్లా అనంతగిరిలో జరిగింది. వాజంగికి చెందిన జ్యోతి (32) డెలివరీ కోసం విశాఖ కేజీహెచ్‌లో వారం కిందట చేరారు. అయితే నిన్న ఆమెకు డిశ్చార్జి చేయగా.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి బయలుదేరారు. గ్రామానికి 3 కి.మీ. దూరంలోనే ఆమె వదిలేశారు. దాంతో కుటుంబీకులు అతికష్టం మీద బాలింతను ఇంటికి తీసుకెళ్లారు.

தொடர்புடைய செய்தி