ఏపీలోని నగరాల్లో ఇళ్లు కట్టుకునే వారికి మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. 100 గజాల్లోపు ఇళ్లకు ప్లాన్ పర్మిషన్ అవసరం లేకుండా తీసుకోనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. త్వరలో దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. 300 గజాల్లోపు ఇళ్లకు సులభంగా ప్లాన్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు.