పాతపట్నం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం అన్నారు. మెలియాపుట్టి మండలం పట్టుపురం నుంచి కోసమాల వరకు రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.