పాతపట్నం మండలంలో మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తు శనివారం రాత్రి పదవి విరమణ చేసిన బోయిన శ్రీధర్ ను పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సన్మానించారు. అంకితభావంతో పనిచేసి మండలంలో విద్యార్థుల అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేసిన శ్రీధర్ అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం స్థానిక మండల ఉపాధ్యాయులు కార్యాలయ సిబ్బంది హాజరై పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.