కవిటి మండలం ఆర్. బెలగాంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, నవోదయ యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవంలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగమని నవోదయ యువజన సంఘం సభ్యులు తెలిపారు.