ఇరిగేషన్ సమస్యలను పరిష్కరించాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సంబంధిత శాఖ మంత్రికి సమస్యలను వివరించారు. మైనర్ ఇరిగేషన్ దృష్టి సారించాలని అన్నారు. ఐదు సంవత్సరాల్లో కనీసం పూడికలు కూడా తీసే పరిస్థితి లేదన్నారు. మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో పనులు చేయడానికి అవకాశం లేదని, అక్కడ కాలువల్లో పూడికలు తీయించాలని కోరారు.