రణస్థలం: ఆశ్రమ ప్రారంభానికి రావాలని సీఎంకు ఆహ్వానం
రణస్థలం మండలం బంటుపల్లి పంచాయితీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని శ్రీశ్రీ రాధా గోకులానంద ఆశ్రమం ఏర్పాటయ్యింది. ఈ ఆశ్రమం ప్రారంభోత్సవం 2025 ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్. ఈశ్వర్రావు తదితరులను శుక్రవారం కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆశ్రమ పండితులు కూడా పాల్గొన్నారు.