ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాక్ కమిటీ ఛైర్మన్ డా. శ్రీరామ్ కవాలే, రాజలింగం నారాయణ, రాకేశ్ రావు సభ్యులతో కూడిన బృందం రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం పర్యటించారు. కళాశాలలో విద్యాబోధన మౌలిక సదుపాయాలు వివిధ గ్రూపులకు సమాచార సేకరణ చేశారు. నాక్ బృందం కళాశాలను సందర్శించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్. ఎస్. ఎన్. స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.