శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శహలాపుట్టుగ సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్రపటాలను అదే గ్రామానికి చెందిన జనసేన నేత మున్నా అందించారు. ఇందులో భాగంగా సచివాలయ అధికారి జయకృష్ణ, ఇతర సిబ్బంది సమక్షంలో మున్నా అందజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్ర కీలకమని జనసేన నేత అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.